2.ఓ ఫస్ట్ రేటింగ్ ఎంతో తెలుసా..?

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మించిన భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా రేపు ( నవంబర్ 29న ) ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు.

ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్న వారికీ గుడ్ న్యూస్..తాజాగా ఈ చిత్ర ఫస్ట్ రేటింగ్ బయటకొచ్చింది. ప్రముఖ యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ చిత్ర ఫస్ట్ రేటింగ్ ఇచ్చాడు.

ఏకంగా 4 రేటింగ్ ఇచ్చాడు. విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని , రజనీకాంత్ – అక్షయ్ కుమార్ ల నటన ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని , అలాగే శంకర్ దర్శకత్వ ప్రతిభ అమోఘమని చెప్పుకొచ్చాడు. ఈయన రేటింగ్ లు ఏమాత్రం నమ్మకూడదు. ఈయన 4 రేటింగ్ ఇచ్చిన సినిమాలు అన్నీ డిజాస్టర్ లు , ప్లాప్ లు , యావరేజ్ లు గా అయ్యాయి. ఈ నేపథ్యం లో 2.ఓ 4 రేటింగ్ కాస్త ఖంగారులో పడేస్తుంది. మరి ఈయన రేటింగ్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.