2.ఓ లో ముందు విలన్ గా అనుకున్నది ఎవర్నో తెలుసా..?

శంకర్ – రజనీకాంత్ కలయికలో తెరకెక్కిన 2.ఓ నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు సైతం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లో బిజీ బిజీ గా గడుపుతున్న చిత్ర యూనిట్ , సినిమాకు సంబందించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేసారు.

ఈ సినిమాలో విలన్‌గా ముందుగా అక్షయ్ కుమార్‌ను అనుకోలేదట. హాలీవుడ్ స్టార్ ఆర్నల్డ్ ను తీసుకుందామనుకున్నాడట శంకర్. అంతే కాదు ఆర్నాల్డ్‌కు 2.0 కథ కూడా వినిపించాడట. కథ విన్న ఆర్నాల్డ్.. కాల్షీట్లు కూడా ఇచ్చాడట. కానీ.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆర్నాల్డ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఎందుకు తప్పుకున్నాడో మాత్రం తెలియజేయలేదు శంకర్.

ముంబై లో ప్రొమోషన్లతో బిజీ బిజీ గా గడుపుతున్న శంకర్ ఈ సినిమా ఫలితం గురించి అందరిలాగానే ఎదురుచూస్తున్నాడు.