టీజర్ టాక్ : చిట్టి ఈజ్ బ్యాక్ ..రోబోకు మించి

రజనీకాంత్ సినీ కెరీర్ లో రోబో ఓ అద్భుతం. దర్శకుడు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మలిచాడు. అప్పటివరకూ వున్న రికార్డ్స్ ని బ్రేక్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు 2.o వస్తుంది. భారీ వ్యయం , భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యంది. వినాయక చవితి కానుకను టీజర్ బయటికి వచ్చింది.

సైన్స్ ఫిక్షన్ వరల్డ్ అంటే ఎలా ఉంటుందో టీజర్ రూపంలో చూపించారు. హాలీవుడ్ సినిమాకి తీసిపోని రీతిలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు దర్శకుడు శంకర్. టీటీజర్ లో కనిపించిన ప్రతీ షాట్ అద్భుతంగా వుంది. టీజర్లో గొప్ప మెరుపులు మెరిపించారు. ఈ టీజర్లోనే కథేంటో రివీల్ అయిపోయింది. ఈ ప్రపంచానికి తలెత్తిన ఓ విపత్తును ఎదుర్కొనేందుకు చిట్టీ అనే రోబోట్ ఏం చేసింది? అన్న దానిని తెరపై చూపిస్తున్నారని అర్థమైంది