సంక్రాంతి బరిలో ఆ నాలుగేనా..?

కరోనా వైరస్ కారణంగా చిత్రసీమ అంత తలకిందులు అయ్యింది. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి..థియేటర్స్ మూతపడ్డాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ల్యాబ్ కే పరిమితం అయ్యాయి. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలూ వాటిల్లాయి. ప్రస్తుతం కేంద్రం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం తో మళ్లీ షూటింగ్ లు మొదలు అవుతున్నాయి. ఇక ఈసారి సంక్రాంతి సీజన్ మరింత జోష్ నింపబోతున్నాయి. గత సంక్రాంతి బరిలో సరిలేరు , ఆలా చిత్రాలు భారీ హిట్స్ అయ్యాయి. ఇక 2021 సంక్రాంతి బరిలో మాత్రం చిన్న ,పెద్ద హీరోల సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సంక్రాంతి రేస్ లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న “క్రాక్” నాగ చైతన్య నటించిన “లవ్ స్టోరీ” అంతే కాకుండా “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్” అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” కూడా అదే సమయాన్ని లాక్ చేసుకున్నట్టు టాక్. అలాగే మరో భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా లైన్ లో ఉందట. మరి ఈ అన్నిటిలో వాస్తవానికి ఎన్ని చిత్రాలు వస్తాయో చూడాలి.