ఆ కుర్ర హీరోకి బలుపు ఎక్కువైయింది

ఖాతాలో సరిగ్గా మూడు హిట్లు లేవు. కాని చాలా క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజు వాపో బలుపో తెలీదు. కాని ఆ కుర్ర హీరో కళ్ళు నెత్తికెక్కాయి. అతడ్ని ”యూత్ ఐకాన్” అని ఎవరు అన్నారో తెలీదు కానీ ఓ వర్గం మీడియా మాత్రం అతడ్ని యూత్ ఐకాన్ అని సంబోదిస్తుంది. జనరల్ గా మీడియా.. యూత్ ఐకాన్ . క్రేజీ స్టార్ .. ఇలాంటి పదాలు పడికట్టుగా వాడేస్తుంటుంది మీడియా. ఎందుకంటే అక్కడ రాసే రైటర్ కి మంచి బిగినింగ్ దోరాలని అలాంటి పదాలు వాడుతారు. దరిద్రం ఏమిటంటే యూత్ ఐకాన్ అనే మాటకు సరిగ్గా అర్ధం వాళ్ళకు కూడా తెలీదు. ”స్వామి వివేకనంద” గురించి రాస్తున్నప్పు యూత్ ఐకాన్ అని జీవితంలో రాసివుండరు ఈ సినిమా కాలమ్స్, ప్రోగ్రామ్స్ రాసినవాళ్ళు. ఎందుకంటే సినిమా లాంటి సొల్లు వార్తలు రాసే వాళ్ళకు యూత్ ఐకాన్ అంటే మీనింగ్ తెలీదు. అయితే ఇలాంటి మీనింగ్ లెస్ వార్తలు, పబ్లిసిటీ చూసి సదరు హీరోకి బలుపు బాగా పెరిగిపోయింది. రెక్లెస్ గా మాట్లాడటం, అదే స్టైల్ అనుకోవడం, తానేదో యూత్ మొత్తాన్ని ఉద్దరించేసినట్లు బిల్డప్ కొట్టడం ఆ హీరోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇలాంటి కుర్ర హీరోలను టాలీవుడ్ చాలా మందిని చూసింది. తరుణ్ , ఉదయ్ కిరణ్ ఇలాంటి హీరోలు ౦` వాళ్ళు ఫామ్ లో వున్నప్పుడు ఇంతకంటే గొప్ప రోజులు అనుభవించారు. సీన్ కట్ చేస్తే వాళ్ళు ఎక్కడ వున్నారో తెలిసిందే. వాపుని చూసి బలుపు అనుకోకూడదు. అసలైన హీరోయిజం హిట్లు కొట్టినప్పుడు కాదు.. వరుసగా పది ఫ్లాపులు పడినా మళ్ళీ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు మొదటి ఆటకే క్యూలో నిలబడాలి. అదీ హీరోయిజం. ఈ కుర్ర హీరోకి ఇంకా ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురుకాలేదు. కానీ మీడియా బాగా ఎత్తేయడం వల్ల కళ్ళు నెత్తికెక్కిపోయాయి. నిజంగానే తానేదో ఉద్దరించేస్తునట్లు ఫోజులు కొట్టి తెగ బిల్దఫ్ ఇస్తున్నాడు. మీడియా ఇచ్చిన యూత్ ఐకాన్ టైటిల్ ని నిజంగా జనాలు ఇచ్చినట్లే ఫీలైపోతున్నాడు. ఇలా కళ్ళు నెత్తికెక్కితే అతడికే ప్రమాదం. ఇది గ్రహించి మసలు కోవాలి.