‘అఅఅ’ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు ప్లాపులతో మళ్లీ ఇబ్బందిలో పడ్డాడు. ఈ నేపథ్యం లో వరుస ప్లాప్స్ తో హిట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల దర్శకత్వం లో అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో వెంకీ , దుబాయ్ శ్రీను వంటి సూపర్ హిట్లు వచ్చాయి. దీంతో వీరిద్దరి కాంబో లో వచ్చే ఈ అమర్ అక్బర్ ఆంటోని ఖచ్చితంగా హిట్ ఇస్తుందని అంత అనుకుంటున్నారు.

మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న‌ మూవీ విడుద‌ల కాబోతుంది. ఈ నేపథ్యం లో ఈ మూవీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ అభిమానులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికా పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ అప్ డేట్స్ ఎప్పటికి కప్పుడు తెలియజేస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచుతూ వస్తున్నారు చిత్ర యూనిట్ .