ప్రముఖ నటుడు ఆసక్మిక మృతి !

పశ్చిమ బెంగాల్‌ కు చెందిన ప్రముఖ నటుడు స్వరూప్‌ దత్‌ ఈరోజు తెల్లవారుజామున కన్ను మూశారు. ఆయన వయోభారంతోనే మరణించారని అంటున్నారు. కొంత కాలంగా వృద్ధాప్యంతో బాధపడుతున్న స్వరూప్‌ శనివారం నుండి ఆపస్మారక స్థితికి వెళ్లిపోయారు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు.

చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. ఆయన కొడుకు షరన్‌ దత్‌ కూడా నటుడే. విభిన్నమైన పాత్రలు పోషించడంలో స్వరూప్ దిట్ట. పాత్ర ఏదైనా అలవోకగా ప్రేక్షకులను మెప్పించేవారు ఆయన. 1968లో తపన సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘అపంజన్‌’ సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు.

ముందు నాటకరంగంలో నటుడిగా కొనసాగారు. ఆ తర్వాత సినిమాల్లో ఎంటర్ అయ్యారు. ఇక ‘సగిన మహటో’, ‘హర్మోనియం’, పితా పుత్ర అండ్‌ మా ఓ మేయే’ వంటివి ఈయన చేసిన ప్రముఖ చిత్రాలుగా చెప్పవచ్చు. బెంగాల్‌ గొప్ప నటుల్లో ఈయనొకరుగా ప్రఖ్యాతి గడించారు. 60, 70 దశాల్లో ఈయన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించాయి.