టబు రేటింగ్ మామూలుగా లేదుగా

 

సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలగు వెలిగిన నాయికామణి టబు.  బాలవుడ్ లో ఇప్పుడు కూడా తమ సత్తా చాటుతుంది. ఆమె చేసిన ‘అందాదున్, దే దే ప్యార్ దే’ సినిమాలు మంచి విజయాల్ని సాధించడంతో ఆమెకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో  హిందీ నిర్మాతలు  కూడా ఆమె ఎంత అడిగితే అంత రెమ్యునరేష్ ను ఇచ్చేస్తున్నారు.

అదేవిధంగా అదే పద్ధతినే తెలుగులో కూడా ఫాలో అవుతోంది టబు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో టబు ఒక కీలక పాత్రలో నటించనుంది. ఈ పాత్ర కోసం ఆమె భారీ మొత్తం ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ మొత్తం ఎంతంటే అది ఆ సినిమాలో హీరోయిన్  చేసున్న పూజా హెగ్డే రెమ్యునరేష్ కంటే ఎక్కువని తెలుస్తోంది.  ఇప్పుడు టబు ఇలా డిమాండ్ చేస్తుంటే ఒకవేళ సినిమా హిట్టైతే ఇంకెంత అడుగుతుందోనని నిర్మాతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.