అదుగో నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్


ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో పంది పిల్లపై అదుగో సినిమాని రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ అభిమానుల‌లో చిత్రంపై ఆస‌క్తిని క‌లిగించింది. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయబోన్నారు.

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తొలి సాంగ్‌ని తాజాగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్ . స్టూపిడ్ స్టూపిడ్ అంటూ సాగే ఈ పాట‌కి భాస్క‌ర‌బ‌ట్ల లిరిక్స్ అందించ‌గా, రిద్ది పాట పాడారు. ‘అదుగో’ సినిమాలో అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిర్మాత సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.