రానా పెళ్లిపై అక్షయ్ ఏలా కామెంట్ చేసాడో తెలుసా..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఈరోజుతో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించిన మిహికా తో ఏడుఅడుగులు వేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వీరి పెళ్లికి 30 మంది అతిథుల్నిమాత్రమే ఆహ్వానించారు. అయితే రానా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతుండడం తో సినీ స్టార్స్ రానా కు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం కాస్త డిఫరెంట్ ట్వీట్ చేసి ఆకర్షించారు. ”శాశ్వతంగా లాక్-డౌన్ అవ్వడానికి సరైన మార్గం.. కంగ్రాట్స్.. మీ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా” అని అందులో పేర్కొన్నారు. అక్షయ్ పెట్టిన ఈ కామెంట్‌లో ‘శాశ్వతంగా లాక్-డౌన్’ అనే పదం నెటిజన్లు ఆకర్షిస్తోంది.

Perfect way to get permanently locked-down 🙂 Congratulations @RanaDaggubati , wishing you both a lifetime of happiness ♥️ https://t.co/asr7d0Vrf2— Akshay Kumar (@akshaykumar) August 8, 2020