నేను తారక్ ని గారు అనలేను


ఎన్టీఆర్ ని తాను ‘టైగర్’ అనే పిలుస్తానని, నిజంగా, ఆయన ‘టైగరే’ అన్నాడు అఖిల్. అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ వేడుకలో అఖిల్ మాట్లాడతూ.. ‘ ‘తారక్ గారు’ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడని, ఓ సందర్భంలో తాను ‘థ్యాంక్స్’ చెప్పినా కూడా ఒప్పుకోలేదని, ‘ఇది నా బాధ్యత’ అని తారక్ చేసిన వ్యాఖ్యలను అఖిల్ ప్రస్తావించాడు. నేను ‘గారు” అంటే.. ”ఏంట్రా బలిసిందా..? నాతో అలా వుండకు” అని అంటారు అని చెప్పాడు.

ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన తమన్ కి కృతజ్ఞతలు చెప్పాడు. దర్శకుడు వెంకీ అట్లూరి తన కోసం మూడేళ్ళు వెయిట్ చేశాడని, ఇంత సమయం వెయిట్ చేసి ఓ మంచి సినిమా ఇచ్చినందు ధన్యావాదాలు చెప్పాడు. నిర్మాత ప్రసాద్ గారు ఈ సినిమాకి రియల్ హీరో అని కితాబిచ్చాడు అఖిల్.