అల..రికార్డ్స్ అల వస్తూనే ఉన్నాయి..

అల్లు అర్జున్ – పూజా హగ్దే జంటగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురం లో. ఈ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో తెలియంది కాదు. ముఖ్యంగా ఈ చిత్రంలో సాంగ్స్ మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ఎప్పటికప్పుడు రికార్డ్స్ కొడుతూ వార్తల్లో నిలుస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ సాంగ్స్ జియో సావన్ లో ఏకంగా 200 మిలియన్ ప్లేస్ దక్కించుకొని రికార్డు రేపాయి. ఓ ప్రాంతీయ భాషా చిత్ర సాంగ్స్ కి ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. 200 మిలియన్ ప్లేస్ అంటే సాధరన విషయం కాదు. అంటే జియో సావన్ లో ఇప్పటి వరకు 20 కోట్ల సార్లు ఈ మూవీ పాటలు విన్నారని అర్థం.