వైజాగ్ లో అల సక్సెస్ మీట్..

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అల వైకుంఠపురం లో చిత్రం సంక్రాంతి బరిలో వచ్చి భారీ సక్సెస్ సాధించింది. బన్నీ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కు ప్లాన్ చేసింది.

ఈనెల 19న బీచ్ సిటీ గా పేరున్న వైజాగ్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 24న తిరుపతి, కర్ణాటక, కేరళలో కూడా సక్సెస్ మీట్స్ ప్లాన్ చేశారట. పూజ హగ్దే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో టబు , జయరాం , సునీల్ , సుశాంత్ మొదలగు వారు నటించగా థమన్ మ్యూజిక్ అందించారు. చినబాబు , అల్లు అరవింద్ లు సంయుక్తం గా ఈ సినిమాను నిర్మించారు.