అప్పుడే కూతురుకి పేరు ఫిక్స్ చేసిన అలియా

అలియా భట్ అప్పుడే తనకు పుట్టబోయే కూతురుకి పేరు ఫిక్స్ చేసింది. తనకు కూతురు పుడితే అల్మా అనిపిలుస్తానని చెప్పింది. దిని వెనుక ఒక స్టొరీ కూడా వుంది. ఆలియా కథానాయికగా నటించిన ‘గల్లీ బాయ్‌’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొంది. ఆ సమయంలో ఓ అభిమాని ఆలియా పేరు మర్చిపోయి ఆమెను ‘అల్మా’ అని పిలిచింది. దాంతో తనకు ఈ పేరు ఎంతో నచ్చిందని, తన కూతురికి ఇదే పేరు పెట్టాలనుకుంటున్నాని ఆలియా చెప్పింది.

Also Read :   కియారా చేతిలో భారీ చిత్రం..

కాగ ఇప్పుడు అందరి కళ్లు అలియాపెళ్లిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఆలియా.. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు ఆమె తండ్రి మహేశ్‌ భట్‌ ఓ సందర్భంలో వెల్లడించారు. దాంతో ఆలియా, రణ్‌బీర్‌లు ఈ ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు నిజం కావాలని వారి అభిమానులు కూడా ఆశ పడుతున్నారు.

Loading...