అలియా పెళ్లి ఫోటో !


వరుణ్ దావన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, మాధూరీ దీక్షిత్ ఇలా భారీ తారాగణం నటిస్తున్న సినిమా కలంక్. పౌరాణిక డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కరణ్ జొహార్ నిర్మిస్తున్నాడు.

తాజాగా అలియాకి సంబంధించిన ఫొటో లీక్ అయ్యింది. ఆలియా ఎరుపు రంగు లెహంగా, నగలు ధరించి పెళ్లి కుమార్తెలా ఈ ఫొటోలో కనిపిస్తోంది. దీంతో పాటు ముదురు పచ్చరంగు లెహంగా ధరించి డ్యాన్స్‌ వేస్తున్న వీడియో కూడా వైరల్‌ అవుతోంది. అయితే నెటిజన్లు దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆలియా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనడానికి ఇది సిగ్నల్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.