అల్లరోడి కొత్త సినిమా

మినిమమ్ గ్యారెంటీ హీరో అల్లరి నరేష్. అయితే ఇప్పుడు మునుపటి జోష్ లేదు. ఆయనకి వరసగా పరాజయాలు చుట్టుముట్టాయి. నరేష్కు చానళ్ళు గా హిట్ పడలేదు. కామెడి సరిగ్గా పండటం లేదు. ఇలాంటి నేపథ్యంలో కాస్త గ్యాప్ ఇచ్చిన నరేష్ ఇప్పుడు మరో సినిమా మొదలుపెడుతున్నాడు.

హీరో అల్లరి నరేశ్‌ హీరోగా ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో హరీశ్‌ శంకర్‌ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్‌ కనకమేడల దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచం కానున్నాడు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.