మహేష్ మల్టీప్లెక్స్ కు పెద్ద చిక్కు వచ్చిపడింది..

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఏఎంబీ మాల్ పేరుతో హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం ఈ థియేటర్ లో ఏడు స్క్రీన్ లు ఉండగా , అందులో ఆరు స్క్రీన్ లను రెగ్యులర్ గా సినిమాలు ప్రదర్శించగా, ఒక స్క్రీన్ లో మాత్రం ప్రత్యేక షో లు మాత్రమే ప్రదర్శిస్తారని సమాచారం. దాదాపు మహేష్ ఈ థియేటర్ కోసం రూ. 80 కోట్ల వరకు ఖర్చు పెట్టారని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సిటీ లో ఈ థియేటర్ గురించే అంత మాట్లాడుకుంటున్నారు.


మల్టీప్లెక్స్ గొప్పతనం గురించే కాదు మల్టీప్లెక్స్ లో ఉన్న సమస్యల గురించి కూడా అంత మాట్లాడుకుంటున్నారు. థియేటర్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుందని చెపుతూనే ఈ మాల్ లో పార్కింగ్ పెద్ద సమస్యగా ఉందని మహేష్ , నమ్రతల దృష్టికి తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను తెలుపుతున్నారు. పార్కింగ్ విషయంలో ప్రణాళికా బద్ధంగా లేదని విమర్శిస్తున్నారు. పార్కింగ్ సమస్య అనేది ఒక్క ఈ మాల్ కుమాత్రమే కాదు ప్రతి ఒక్క మాల్ లో ఈ సమస్య ఉంది. కాకపోతే అన్ని మాల్స్ లా కాకుండా ఈ ఏఎంబీ మాల్ ప్రత్యేకం కాబట్టి త్వరగా ఈ పార్కింగ్ సమస్య కు ఓ ఆలోచన చేయాలనీ కోరుకుంటున్నారు. మరి నమ్రత దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.