అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తున్న చరణ్ హీరోయిన్..

వెండితెర ఫై హాట్ హాట్ అందాలతో యూత్ కు కిక్ ఇచ్చిన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్..రీసెంట్ గా ఓ బిడ్డకు జన్మ నిచ్చింది. ప్రస్తుతం ఆ బిడ్డ తో అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఎవడు చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈమె..తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత అతి తక్కువ సినిమాలే చేసిన ఈమె…సొంత దేశానికి వెళ్లిపోయి జార్జ్ పనాయిటౌ తో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది.

ప్రస్తుతం ఈమె తన కొడుకుతో హ్యాపీ గా గడుపుతుంది. దీనికి సంబందించిన పిక్ ను పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటుంది. వారసుడు కాస్త పెరిగిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకొస్తానంటుంది అమీ జాక్సన్.