మహేష్ బాబు తండ్రిగా అనిల్..?

స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ లో మహేష్ తండ్రి గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.

భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ అయిన అనిల్ కపూర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.