అనిల్ సుంకర చేతికి మహా సముద్రం..?

RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి…మొదటి సినిమాతోనే ఎంత క్రేజ్ తెచ్చుకోవాలో అంత తెచ్చుకున్నాడు. కేవలం ఆయన మాత్రమే కాదు..ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ..హీరోయిన్ పాయల్ కు సైతం ఎంతో క్రేజీ వచ్చింది. అజయ్…మహాసముద్రం టైటిల్ తో ఓ కథ సిద్ధం చేసి ఎప్పటి నుండి ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కానీ అది వర్క్ అవుట్ కావడం లేదు. హీరోలు ఒక అనేలోపు నిర్మాతలు చేజారిపోతున్నారు. ఇద్దరు ఓకే అనుకునేలోపు హీరోయిన్ మిస్ అవుతుంది..ఇలా పలుమార్లు జరుగుతుండడం తో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు.

ప్రస్తుతానికి అయితే సినిమా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ కాంపౌండ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. కరోనా హడావుడి ముగిసాక జరిగే చర్చల ఫలితాన్ని బట్టి, ఈ సినిమా పట్టాలెక్కడం లేదా అనేది తెలుస్తుంది. హీరోగా మాత్రం శర్వా నే అంటున్నారు. ప్రస్తుతం శర్వా సినీ కెరియర్ కూడా పెద్దగా ఏమిలేదు. వరుస సినిమాలు ప్లాప్ అవ్వగా ..రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.