వెంకీమామపై సరిలేని ట్వీట్


వెంకటేశ్‌, ఆయన మేనల్లుడు నాగచైతన్య ల ‘వెంకీ మామా పైఅనిల్‌ రావిపూడి ప్రసంసాల్ జల్లు కురిపించాడు . శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో అనిల్‌ రావిపూడి ‘వెంకీమామ’ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ‘‘వెంకీమామ’.. మాస్‌ విలేజ్‌ ఫన్‌. వెంకటేశ్‌ గారు, చైతూ నటన సూపర్‌గా ఉంది. మామా అల్లుళ్లు అదరగొట్టారు. గుడ్‌ వర్క్ బాబీ డార్లింగ్‌. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

ఈ సినిమా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జంటగా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించగా.. చైతూకు జంటగా రాశీఖన్నా నటించింది.