అంజలి ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో తెలిపింది..

‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్ అంజలి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా గడుపుతుంది. కాకపోతే తమిళనాట అమ్మడికి ఇవ్వక అవకాశాలు ఉండడం తో ఎక్కడ చెన్నై లోనే గడుపుతుంది. తాజాగా ఈమె విజయ్ సేతుపతి తో ‘సింధుబాద్‌’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై భారీ అంచనాలే పెట్టుకుంది.

ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న ఈమె సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి కొంచెం చెవుడు కలిగిన పాత్ర అని, అయనకు గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుందని చెప్పింది. తాను గ్రామంలో నివశించే సాధారణ యువతిగా నటించానని, కట్టు, బొట్టు అంతా సహజంగా ఉంటాయని చెప్పింది. పాటల్లో మాత్రం కాస్త గ్లామర్‌గా కనిపిస్తానని అంది. హీరోల్లో ఎవరైనా మీకు ఐలవ్యూ చెప్పారా..? అని ప్రశ్నకు లేదని బుదులిచ్చింది. తాను నటించిన హీరోలలో ఎక్కువ మందికి పెళ్లిళ్లు అయ్యాయని చెప్పింది. నటుడు జైకే ఇంకా పెళ్లి కాలేదని, తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తనకు తెలియదని పేర్కొంది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిందనే గతంలో ప్రచారం సాగింది. తాను పెళ్లి చేసుకుంటే తమిళ అబ్బాయినే చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది.