ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?

మీరు పైన చూస్తున్న ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు ప‌ట్టారా?..ఏంటి గుర్తుకు రావడం లేదా..ఆమెనే అంజలి. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో సీతమ్మగా యావత్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అజలినే ఆమె. ఒక‌ప్పుడు బొద్దుగుమ్మ‌లా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా సన్నగా మారిపోయింది. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత వరుస సినిమా ఛాన్సులు కొట్టేసిన ఈ భామ , కొన్ని రోజులుగా పూర్తిగా క‌నిపించ‌డం మానేసింది. కొన్ని రోజులు ప్రేమాయణం సాగించి సినిమాలకు దూరమైన ఈమె , ప్రేమ విఫలం కావడం తో మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని డిసైడ్ అయ్యింది. అంతే పూర్తిగా మేకోవ‌ర్ అయిపోయింది.

ఇప్పుడు మేకోవ‌ర్ అయిపోయి వ‌ర‌స సినిమాలతో బిజీ అవుతుంది అంజ‌లి. ప్ర‌స్తుతం నాడోడిగ‌ల్ 2.. గీతాంజ‌లి సీక్వెల్.. పెరంబు.. లిస్సా లాంటి సినిమాల్లో న‌టిస్తుంది అంజ‌లి. గ‌తంలో అంజ‌లి న‌టించిన సినిమాల‌తో పోలిస్తే ఇప్పుడు ఈమె న‌టిస్తున్న సినిమాల‌పై అంచనాలు తక్కువే. అయితే విజ‌య్ సేతుప‌తితో త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌బోతుంది అంజ‌లి. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న కెరీర్ మార్చేస్తుంద‌ని నమ్మకం తో ఉంది. చూద్దాం అంజలి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుందో.