అంతరిక్షం టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి జంటగా ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 KMPH ‘. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకుంది.

హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను అక్టోబర్ 17 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా , ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరుగుతున్నాయి.

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.