బిజినెస్ మెన్ తో అనుష్క పెళ్లి ?

అనుష్క పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్కకి ఎప్పుడో పెళ్లీడు వచ్చింది. చాలా రోజులుగా ఆమె పెళ్లి వార్తలు వస్తున్నాయి. రూమర్లు కూడా తక్కువేమీ కాదు. బహుసా అనుష్కపై వచ్చినన్నీ రూమర్లు మరే హీరోయిన్ పై రాలేదు. స్వయంగా అనుష్కనే ఒకసారి ”నాకు డజను పెళ్లిలు చేశారు. ఇంకా ఎన్ని సార్లు చేసుకోవాలో” అని నవ్వేసింది. అంతలా వచ్చాయి రూమర్లు. అయితే ఇవన్నీ రుమార్లుగానే మిగిలిపోయాయి. తనపై ఎన్ని గాసిప్స్ వచ్చిన నవ్వుతూ సరదాగానే సమాధానం చెప్పి తన డిగ్నిటీ చూపించింది స్వీటీ.

అయితే ఈ వెండితెర యువరాణిని మనువాడే యువరాజు మాత్రం ఇప్పటివరకూ కనిపించలేదు. అయితే ఇప్పుడా సమయం వచ్చింది. అవును.. అనుష్క పెళ్లి దాదాపు ఫిక్స్ అయిపోయిందని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క ఈ ఏడాది చివర్లో పవిత్రబంధంలో కి అడుగుపెట్టబోతుందని తెలిసింది. ఇప్పటికే అనుష్క కుటుంబ సభ్యులు వరుడిని వెదికి వుంచారని, ఆ వరుడు అనుష్కకి కూడా నచ్చాడని తెలిసింది. త్వరలోనే అనుష్క పెళ్లిపై అధికారిక ప్రకటన రావచ్చని వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో వార్త ఏమిటంటే.. అనుష్కకి కాబోయే భర్త ఒక బిజినెస్ మెన్ అని, అతనకి దుబాయ్ లో వ్యాపారం వుందని టాక్.

ఇక స్వీటీ సినిమాల విషయానికి వస్తే గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేస్తుంది అనుష్క. ఇటివలే సైలెన్స్ అనే టైటిల్ తో మరో తెలుగు సినిమా అంగీకరించింది. దిని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. పెళ్లి తర్వాత కూడా తనకు నచ్చిన పాత్రలు చేయాలనే ఆలోచనలో వుంది స్వీటీ.