ఫ్యాన్స్ రెడీ గా ఉండండి..రెండో సాంగ్ వచ్చేస్తుంది

ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్రం ఫై రోజు రోజుకు అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి..విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేస్తుంది. ఇప్పటికే తమన్ అందించిన సంగీతం పట్ల అభిమానులు , ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా థమన్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారని ఫిక్స్ అయ్యారు.

తాజాగా ఈ చిత్రం నుండి ‘అనగనగా’ లిరికల్ వీడియో సాంగ్ ఇప్పటికే విడుదలై, సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఈ లోపే చిత్రంలోని రెండో సాంగ్ ‘పెన్విటీ’ ను రేపు సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా, నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో కూడా సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్లోకి విడుదల అవ్వనుంది. అక్టోబర్ మొదటి వారంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసారు.