రంగస్థలం రికార్డు బ్రేక్ చేసిన అరవింద ..

ఎన్టీఆర్ నుండి అసలు సిసలైన సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వేట మొదలైనట్లే అని మరోసారి అరవింద సమేత నిరూపించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో లో మొదటిసారి తెరకెక్కిన ఈ చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ రావడం తో చిత్ర ఓపెనింగ్ అన్ని సెంటర్లలో అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా ఇతర చోట్ల కూడా బ్రహ్మాండమైన వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ కలెక్షన్లు రంగస్థలం చిత్ర ప్రీమియర్ షోల కలెక్షన్లను బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. సుకుమార్ – చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ప్రీమియర్ షోల ద్వారా యూఎస్ లో 707 కె డాలర్లు(5 కోట్లు) నెలకొల్పగా..ఇప్పుడు అరవింద 5.85 కోట్లు (791కె డాలర్లు) నెలకొల్పి , రంగస్థలాన్ని ఓ మెట్టు కిందకు నెట్టింది. ఇక గురువారం నాడు మరో $208721 కలెక్షన్స్ రిజిస్టర్ చేసి వన్ మిలియన్ ( $1006087 ) మార్క్ ను దాటేసింది.

మొత్తం మీద ఎన్టీఆర్ వేట మొదలుపెడితే ఎలా ఉంటుందో ప్రీమియర్ కలెక్షన్లతో అర్థమైంది. చిత్ర సక్సెస్ తో అభిమానులు , చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నారు.