నిజమా..అరవింద కలెక్షన్లు డ్రాప్ అయ్యాయా..?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అరవింద సమేత. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసి , ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి నాల్గు రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు కనపరిచిన ఈ మూవీ , సోమవారం కాస్త కలెక్షన్లు తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లలో మేజర్ డ్రాప్ అయ్యాయని , చాలా చోట్ల 25 శాతానికి వసూళ్లు పడిపోయాయని అంటున్నారు. ముఖ్యం గా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వసూళ్లను ఓ సారిచూస్తే..మొత్తం ‘అరవింద సమేత’ను నాలుగు థియేటర్లలో ఆడిస్తూ వచ్చారు. వారాంతంలో కూడా ఈ నాలుగు థియేటర్లలో ఒక్క సుదర్శన్ థియేటర్లో మాత్రమే హౌస్ ఫుల్ గా నడిచిందని , మిగతా మూడు థియేటర్లలో ఆక్యుపెన్సీ సగటున 70 నుంచి 90 శాతం మధ్య నిండిందని అంటున్నారు. ఇక సోమవారం ఒక థియేటర్ నుంచి ‘అరవింద సమేత’ను తీసేశారు. మిగతా మూడు థియేటర్లలో మార్నింగ్ షోకి చాలా తక్కువ గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

అలాగే హైదరాబాద్ తో పాటు మిగతా నగరాల్లో కూడా ఇదే పరిస్థితి అని చెపుతున్నారు. సోమవారం కాస్త తగ్గిన కానీ రాబోయే రోజుల్లో మళ్లీ పుంజుకోవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 18 న రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే చిత్రం విడుదల కాబోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ని భారీ ఎత్తున థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు.