ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్..

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘అరవింద సమేత’. దసరా కానుకగా అక్టోబర్ 11 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఆడియో , ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెపుతుంది. మొదటిసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో లో సినిమా వస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే చిత్ర బిజినెస్ జరిగినట్లు సమాచారం.

ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంటున్నారు. కేవలం ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కుల రూపంలో 93 కోట్ల మేర బిజినెస్ చేసిందట.

ఇక ఏరియా వైజ్ చూస్తే..

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 19.50 కోట్లు
సీడెడ్ 15కోట్లు
కృష్ణ 5.50కోట్లు(అడ్వాన్ష్)
గుంటూరు 7.5కోట్లు
ప.గో జిల్లా 4.90 కోట్లు
నెల్లూరు 3.30 కోట్లు
ఏపీ-తెలంగాణ 71కోట్లు
కర్నాటక-తమిళనాడు-ఉత్తర భారతదేశం 9.50కోట్లు
ఓవర్సీస్ 12.50 కోట్లు
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 93 కోట్లు