ఇదీ ఎన్టీఆర్ నాల్గు రోజుల లెక్కంటే…


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు సిసలైన సత్తా అంటే ఏంటో అరవింద సమేత తో అందరికి తెలిసొచ్చింది. ఎన్టీఆర్ అంటే తక్కువ చూపు చూసిన వారందరికీ అరవింద ఓ గుణపాఠంలా మారింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 11 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజే నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన అరవింద , నాల్గో రోజు కూడా అదే ఊపు కొనసాగిస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 49 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఏరియా వైజ్ కలెక్షన్లు చూస్తే..

ఏరియా కలెక్షన్స్
గుంటూరు 6.1 కోట్లు
ఈస్ట్ గోదావరి 4.05 కోట్లు
నైజాం 13.82 కోట్లు
సీడెడ్ 10.95 కోట్లు
ఉత్తరాంధ్ర 5.57 కోట్లు
వెస్ట్ గోదావరి 3.32 కోట్లు
కృష్ణ 3.52 కోట్లు
నెల్లూరు 1.80 కోట్లు
తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ డే రూ. 49.13 కోట్లు