అరవింద సమేత ఫస్ట్ డే కలెక్షన్స్ ..


అంత ఊహించినట్లే ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన అరవింద సమేత అక్టోబర్ 11 న భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. ఇక ఈ చిత్ర ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్మేసాయని సమాచారం.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్, ఆస్ట్రేలియాలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. యూఎస్‌లో గురువారం ప్రివ్యూల ద్వారా 791,021 డాలర్లు (సుమారు రూ.5.85 కోట్లు) వసూళ్లు చేసిన ఈ మూవీ ఫస్ట్ డే వన్ మిలియన్ క్రాస్ చేసినట్లు సమాచారం.

ఆస్ట్రేలియా బాక్సాఫీసు వద్ద ‘అరవింద సమేత’ తొలిరోజు 128,740 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.67.63 లక్షలు) వసూలు చేసినట్లు మూవీ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో మొత్తం 35 లొకేషన్లలో ‘అరవింద సమేత’ ప్రదర్శితమవుతోంది. ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ‘అరవింద సమేత’ 9వ స్థానంలో నిలిచిందన్నారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాంలో మొదటి రోజు రూ.8.30 కోట్లు వసూలు చేసింది. దీనిలో షేర్ రూ.5.73 కోట్లు. ఓవరాల్ గా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి రికార్డ్స్ సాధించినట్లు సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.