అరవింద సమేత ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజు నుండే ఎన్టీఆర్ తన దూకుడు చూపిస్తూ తన కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసాడు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏడురోజులకు గాను 52 కోట్ల 66 లక్షలు వసూలు చేసింది. అక్టోబర్ 18 న విడుదలైన హలో గురు ప్రేమకోసమే , పందెం కోడి 2 చిత్రాలకు యావరేజ్ టాక్ రావడం తో అరవింద కలెక్షన్లకు డోకా లేకుండా పోయింది. ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూస్తే..

ఈస్ట్—–> 4.65
వెస్ట్—–> 3.65
కృష్ణ—–> 3.60
నైజాం—–> 15,80
నెల్లూరు—–> 2.16
సీడెడ్—–> 10.10
ఉత్తారాంధ్ర—–> 5.95
గుంటూరు—–> 6.75