షాకింగ్ న్యూస్ : ‘అరవింద సమేత’ టీజర్ లీక్…?

మరోసారి అరవింద సమేత చిత్ర యూనిట్ ను అయోమయం లో పడేసింది. చిత్ర దర్శక , నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ చిత్రాన్ని లీకుల బెడతా వదలడం లేదు. మొన్నటి వరకు ఈ చిత్రానికి సంబందించిన పిక్స్ మాత్రమే లీక్ అయ్యాయి. తాజాగా టీజర్ కూడా లీకైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.

ఇటీవలే చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ కు సంబందించిన అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘అరవిందసమేత’ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం..అని చిత్ర నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. తెలిపిన మరుక్షణమే టీజర్ లీక్ అవ్వడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

టీజర్ చూస్తుంటే మంచి ఎమోషనల్ గా కట్ చేసినట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది. ఈ టీజర్ లో నాగబాబు , ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది. మరి లీకైన టీజర్ నే విడుదల చేస్తారా..లేక మరోటి కట్ చేసి విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం అరవింద చిత్ర దర్శక , నిర్మాతలకు భయం పట్టుకుంది. సినిమా విడుదల నాటికీ ఇంకెలాంటి వీడియోలు లీక్ అవుతాయో అని భయపడిపోతున్నారు.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో ఎన్టీఆర్ సంభాషణలు చెప్పబోతున్నాడు. ఎన్టీఆర్ కు జోడిగా పూజా హగ్దే నటిస్తుండగా, సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.