50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అరవింద’

అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న మూవీ అరవింద సమేత. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మొదటిసారి త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావడం , అలాగే యాక్షన్ నేపథ్యం లో తెరకెక్కుతుండటం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగట్టు త్రివిక్రమ్ చాల జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. తాజాగా ఈ మూవీ 50 శాతంపైగా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఎలాగైనా ఈ మూవీ ని దసరా బరిలో దించేందుకు చిత్ర యూనిట్ రేయిపగలు కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ మూవీ లో ఓ రోల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే మెగా బ్రదర్ నాగబాబు రోల్ గురించి. నాగబాబు ఈ మూవీ లో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ రాయడం జరిగిందని అంటున్నారు. చాల రోజుల తర్వాత నాగబాబు కు ఇలాంటి రోల్ దక్కడం తో ఆయన కూడా సంతోషంగా ఉన్నారని అంటున్నారు.

ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా , సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.