‘అరవింద సమేత ‘ తాజా షూటింగ్ అప్డేట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’. వీరిద్దరి కాంబో తోనే సినిమాకు ఫుల్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. మొదటిసారి త్రివిక్రమ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది.

తాజాగా జులై 16 నుండి రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకోబోతుంది. ఇక ఈ షెడ్యూల్ అనంతరం తదుపరి షెడ్యూల్ కోసం పొల్లాచ్చి వెళ్లనుంది చిత్ర యూనిట్. ఇక ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే సెప్టెంబర్ సెకెండ్ వీక్ లో అడియో ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఇక సినిమాను కూడా అక్టోబర్ 10 లేదా 11న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ మూవీ లో జగపతిబాబు, నాగబాబు వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా తాజాగా మరో సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ షూటింగ్‌లో జాయిన్ అవడం జరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు నటిస్తుండగా, రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. హాసిని & హారిక క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ ఈ మూవీ నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.