అర్జున్ సురవరం 14 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే..

యంగ్ హీరో నిఖిల్ , లావణ్య త్రిపాఠి నటించిన ‘అర్జున్ సురవరం’ నవంబర్ 29 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పాటు ల్యాబ్ కే పరిమితమైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అని అంత భావించారు కానీ ఆకట్టుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తూ నిఖిల్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది.

నిఖిల్ జర్నలిస్ట్‌ పాత్రలో మెచ్యూర్డ్‌గా నటించడం.. లావణ్య త్రిపాఠి గ్లామర్ .. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ఓ ముఠా గుట్టురట్టు చేసే కథ కావడం ఇవన్నీ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 21 .6 కోట్ల గ్రాస్ సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అల్లు అరవింద్ కొనుగోలు చేసారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.