అవతార్‌ సీక్వెల్ షూటింగ్ పిక్ వైరల్ ..

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తుండడం తో ప్రజలు బయటకు వస్తున్నారు. అలాగే చిత్ర సీమా సైతం షూటింగ్లు మొదలు పెడుతున్నారు.

తాజాగా జేమ్స్ కామెరాన్ కూడా ‘అవతార్’ సీక్వెల్‌ షూటింగ్‌ను మొదలుపెట్టారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన తొలి భాగానికి సీక్వెల్‌గా మరో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండో భాగం మొదటి భాగం కంటే అద్భుతంగా ఉంటుందట. ఈ రెండో భాగంలో పండోరా గ్రహాన్ని పూర్తిగా చూపెట్టబోతున్నారట. అలాగే నీటి అడుగు భాగంలో కూడా కొన్ని సీన్లు ఉంటాయట. ఈ సినిమాలో కేట్ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రెన్ డన్ కవెల్ లాంటి టాప్ స్టార్స్ కనిపించబోతున్నారు.

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కేట్ విన్‌స్లెట్ నీటి అడుగున ఏకంగా ఏడు నిమిషాల 14 సెకెండ్ల పాటు ఊపిరి బిగపట్టి ఉందట. ఫ్రీ-డైవ్ కూడా నేర్చుకుందట. నీటి అడుగున షూటింగ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది