బాహుబలి లైవ్ షో.. సూపర్ హిట్

లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైన తొలి ఆంగ్లేతర చిత్రంగా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకొంది బాహుబలి: ది బిగినింగ్ . సినిమాలోని నేపథ్య సంగీతాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ .కీరవాణి నేతృత్వంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ , రానా, అనుష్కలతో పాటు దర్శకుడు ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరయ్యారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడే పంచెకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాజమౌళి. ఇక ఈ షో సూపర్ హిట్ అయ్యింది. అక్కడి ప్రేక్షకులు బాహుబలి మానియాతో ఊగిపోయారు. ప్రభాస్ హాల్ లోకి ఎంట్రీ ఇవ్వగానే విజల్స్ తో హోరెత్తించారు.

కాగా ఇండియన్ సినిమా చరిత్రలో అప్పటివరకూ వున్న రికార్డులన్నీ చెరిపేసి తెలుగు సినిమా ఖ్యాతిని దసదిశలా చాటింది బాహుబలి. ‘బాహుబలి ది: బిగినింగ్‌’ కు కొనసాగింపుగా 2017లో వచ్చిన‘..కన్‌క్లూజన్‌’ బాక్సాఫీస్‌ వద్ద మిగతా రికార్డులన్నీ బ్రేక్ చేసింది. వెండితెర అద్భుతంగా నిలిచిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇండియన్ సినిమాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.