రూలర్ ప్రీ రిలీజ్ వేడుక లో బాలయ్య డైలాగ్స్ తో కుమ్మేసాడు..

నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కె ఎస్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 20 న థియేటర్స్ లోకి వస్తుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో సినిమా ప్రమోషన్లను స్పీడ్ చేసారు. అందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు వైజాగ్ లోని ఎం.జి.ఎం గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ వేడుక లో బాలయ్య తన డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఆపద్భాందవులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, కళాభిమనాలు, కళాపోషకులైన నా అభిమానులకు పాత్రికేయ మిత్రులకు, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో జరుగుతున్న రూలర్ చిత్రం ప్రీ రిలీజ్ లాంచ్ విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, టీవీల్లో చూసేవారందరికీ కళాభివందనాలు అంటూ తన స్పీచ్ ను మొదలు పెట్టిన బాలయ్య..తెలుగు ప్రజలు , అభిమానులు అందరూ బాగుండాలని కోరారు. సినిమా కథ..డైరెక్షన్..నిర్మాణ విలువలు ..నటీనటుల పనితీరు ఇలా అందరి గురించి చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ను వేదిక ఫై పంచుకున్నారు.

ఎవడి మీదరా చెయ్యివేశావ్. రైతు మీదా.
బోషడీకె. మనం వాడే సెల్ ఫోన్ లేకుండా మనం ఉండగలం.
దానిని కనిపెట్టిన వాడు కోటీశ్వరుడు. మనం తాగే మందు తయారుచేసేవాడు కూడా కోటీశ్వరుడు. కాల్చే బీడీలు లేకుండా బతకగలం. కానీ, అవి తయారుచేసేవాడు కూడా కోటీశ్వరుడు. మనం తింటున్నామే అన్నం. అది లేకుండా మనం బతకగలమా.. బతకలేం కదా.. అటువంటి రైతులు మనదేశంలో బిచ్చగాళ్లలా బతుకుతున్నారు..

దుర్గమారాణ్యాలు దున్నాను.
బీడు భూముల్లో పాటుపడ్డాను.
ఏడాది పొడుగునా గాలికి చిక్కాను.
దుమ్ముధూళికి, ఈదురుగాలుల తట్టుకున్నాను.
రాళ్లు రప్పలను దాటాను. ముల్లడొంకల్లో సేదతీరాను.. అంటూ డైలాగ్స్ తో అదరగొట్టాడు.