బాలయ్య సూపర్ మాన్ ..?

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే చూపించడం తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్స్ ఇవే అంటూ పలు పేర్లు చక్కర్లు కొడుతుండగా..మొన్నటి వరకు ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వైరల్ కాగా..తాజాగా సూపర్ మాన్ అనే టైటిల్ వినిపిస్తుంది. కథకు ‘సూపర్ మాన్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.