మోక్షజ్ఞ ఎంట్రీ ని ఖరారు చేసుకున్న బాలయ్య

నందమూరి అభిమానులంతా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఈయన ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపించిన ఇప్పటివరకు ఆ ఎంట్రీ కాకపోయేసరికి అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ మధ్య బయటకొచ్చిన పిక్ లలో మోక్షజ్ఞ ఏమాత్రం ఆకట్టుకునేలా లేడు. చాల లావుగా..పొట్ట తో కనిపించి విమర్శల పాలయ్యాడు.

తాజాగా మోక్షజ్ఞ కు సంబందించిన ఓ వార్త హల్చల్ చేస్తుంది. కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ కి విరామం రావడంతో బాలయ్య..మోక్షజ్ఞ ఎంట్రీపై దృష్టిపెట్టారట. మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నాడట. మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ కోసం అద్భుత కథను వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. 2021 లో మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేయాలనేది బాలయ్య టార్గెట్ గా పెట్టుకున్నాడని అంత అంటున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎవరికీ దక్కుతుందో చూడాలి.