బాలకృష్ణ సినిమాను మిస్ చేసుకున్న జక్కన్న..

దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయాలనీ ప్రతి ఒక్క ఇండస్ట్రీ నటుడి కి ఉంటుంది..అది జక్కన క్రేజ్. ఈయన దర్శకత్వం లో ఒక్క సినిమా చేసిన చాలు..ఆ ఒక్కటితో ఎంత క్రేజ్ రావాలో అంత వస్తుంది. ఇటీవల బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ ఎక్కడికి వెళ్లిందో చెప్పాల్సిన పనే లేదు. అలాంటి రాజమౌళి..బాలకృష్ణ తో ఓ సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే..

రాజమౌళి బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో ఓసారి బాలకృష్ణ – రాజమౌళి కూర్చుని కథలు గురించి మాట్లాడుకుంటున్నారట. ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయల కథ గురించి మాట్లాడుకున్నారట. ఇద్దరం కలిసి ఈ సినిమా చేద్దామని అనుకున్నారట. ఆ తర్వాత ఇదే విషయాన్నీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కు జక్కన్న చెప్పాడట. శ్రీకృష్ణదేవరాయల కథ కు బాలయ్య బాబు తప్ప ఎవరు సెట్ అవ్వరు కానీ ఈ సినిమాను నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పాడట. ఇక గురువు గారి మాట కాదనలేక ఆ సినిమాను ఆయనకే వదిలేసారట. లేకపోతే రాజమౌళి – బాలకృష్ణ కలయికలో శ్రీకృష్ణదేవరాయల కథ వచ్చేదట. మారి బాలయ్య తో రాఘవేంద్రరావు ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి.

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో #RRR (వర్కింగ్ టైటిల్ ) పేరిట ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో మొదలు అయ్యింది. 2020 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.