ఓటీటీలో ‘బెలూన్’..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తెలుగు అమ్మాయి అంజలి..తెలుగు లో కన్నా తమిళనాట నటిగా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బెలూన్ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొన్నటి వరకు ఈ చిత్రాన్ని థియేటర్స్ లలో రిలీజ్ చేయాలనీ భావించారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ కావడంకష్టమే అని తేలడం తో ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘బెలూన్‌’ జీ5లో విడుదల కానుంది. రాజ్‌తరుణ్‌ అతిథి పాత్రలో నటించారు. శినీష్‌ దర్శకత్వం వహించారు. దిలీప్‌ సుబ్బరాయన్‌, అరుణ్‌ బాలాజీ, నందకుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌ జీ ఛానల్స్‌కి సంబంధించిన ఓటీటీ ‘జీ 5’లో ఈ సినిమా ఎక్స్‌క్లూజీవ్‌గా విడుదల కానుంది. జూలై 10 నుండి సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని ‘జీ 5’ పేర్కొంది.