బండ్ల గణేష్ అరెస్ట్..

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అరెస్ట్ అయ్యాడు. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత పీవీపీ ఫిర్యాదు మేరకు బండ్ల గణేశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.

బండ్ల గణేశ్ తన దగ్గర డబ్బు తీసుకొని తిరిగి చెల్లించలేదని..తన ఇంటిపై మనుషులను పంపి బెదిరించారని ఈ నెల 5న జూబ్లీ హిల్స్ పీఎస్‌లో పీవీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బండ్ల గణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 420,448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

తెలుగులో ఈయన కమెడియన్‌గానే కాకుండా నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే కాంట్రవర్సీల్లో కూడా ఎప్పుడూ గణేష్ ముందే ఉంటాడు. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ నిర్మాతగా హీరోలను పొగిడేస్తూ.. వాళ్లకు గిఫ్టులుస్తూనే మరోవైపు అప్పులు, తప్పులు చేస్తూనే ఉంటాడు. ఏదేమైనా కూడా తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్ పేరు తెలియని వాళ్లుండరేమో..