తెరపై పప్పు సుద్ద..

మీడియా లో పప్పు పదం వినగానే టక్కున ఎవరు గుర్తుకొస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ చెపుతుంది మాత్రం మరో పప్పు సుద్ద గురించి..అది కూడా తెరపై రోల్ మాత్రమే… కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాత గా మారిన నటుడు బండ్ల గణేష్. అతి తక్కువ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాలు నిర్మించడం మానేసి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు.. ఇక ఇప్పుడు మరోసారి వెండి తెరకు రి ఎంట్రీ ఇస్తున్నాడు.

మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో గణేష్ కు పప్పు సుద్ద రోల్ ఇచ్చారట. ఈ క్యారెక్టర్ అచ్చం బండ్ల గణేష్ మాట తీరును పోలి వుంటుందని తెలుస్తోంది. బాగా డబ్బు వుండి కూడా పప్పు సుద్దలా వుంటూ, ఉత్తర కుమారుడిలా ఏవేవో మాట్లాడే క్యారెక్టర్ లాంటిది ఒకటి అనిల్ రావిపూడి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ నెలలో సెట్స్ పైకి రానుంది.