బిగ్ బి ఆరోగ్యం ఎలా ఉందంటే

లెజెండ్ యాక్టర్ బిగ్ బి , అలాగే ఆయన కుమారుడు అభిషేక్ కరోనా బారిన పడిన విషయం తెలిసిన దగ్గరి నుండి అభిమానులు , సినీ ప్రముఖులు వారి ఆరోగ్యం ఎలా ఉందనేది గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా.. పిఆర్ ఆఫీసర్ అమితాబ్ ఆరోగ్యంపై ప్రెస్ నోట్ పంపారు.

అమితాబ్ తేలికపాటి కోవిడ్ లక్షణాలతో స్థిరంగా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం బాగానే ఉంది. ఎవరు ఖంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతకు ముందు వారికీ కరోనా వచ్చినట్లు స్వయంగా బిగ్ బి , అభిషేక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘‘నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. కుటుంబానికి, స్టాఫ్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. గత 10 రోజులుగా నాతో దగ్గరగా మెలిగిన వారు ఎవరికి వారుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.’’ అని బిగ్ బి ట్వీట్ చేశారు.

ఆ తర్వాత అభిషేక్ ‘మా తండ్రి, నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇద్దరికీ కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ ఈ సమాచారాన్ని అందించాం. అలాగే మా కుటుంబ సభ్యులు, స్టాఫ్‌కు సైతం కరోనా పరీక్షలు చేయించాం. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని అభిషేక్ ట్వీట్ చేసాడు. కాగా, అమితాబ్ ఫ్యామిలీలో మరి కొందరికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న తోటి నటి నటులు , అభిమానులు త్వరగా వీరు కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నారు.