వెంకీమామ డైరెక్టర్ కు మెగా ఛాన్స్…?

వెంకీమామ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ ..మెగా ఛాన్స్ అందుకోబోతున్నాడా..ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ జరుగుతుంది. వెంకటేష్ , నాగ చైతన్య లను హీరోలుగా పెట్టి బాబీ వెంకీమామ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కామెడీ , లవ్ , సెంటిమెంట్ ఇలా అన్ని సమపాలనలో నింపి వెంకీ కి గ్రాండ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోయే ఛాన్స్ కొట్టేయబోతున్నట్లు తెలుస్తుంది. బాబీ తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఒకే చెప్పాడని సమాచారం. ఈ మధ్యనే అల్లు అర్జున్ కు బాబీ ఒక కథ వినిపించాడని.. ఆ కథ నచ్చడంతో బాబీకి పచ్చజెండా ఊపాడని సమాచారం. సుకుమార్ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా చేస్తాడని ఇంతకుముందే ఒక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. వేణు పింక్ రీమేక్ చేస్తుండడం..ఐకాన్ ప్లేస్ లో బన్నీ బాబీ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రాబోతుందని అంటున్నారు.