విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ రావడం అందర్నీ అప్రమత్తం చేసింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్ని ఆగిపోయాయి. రీసెంట్ గా ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పటికీ ..కరోనా ఉదృతి ఎక్కువ గా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా షూటింగ్ లలో పాల్గొనడం లేదు. విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు.

షూటింగ్ దశలో ఉండగా లాక్ డౌన్ రావడం తో బ్రేక్ పడింది. ఇదిలా ఉంటె తాజాగా హీరో ఇంటికి ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బాంబులతో హీరో ఇంటిని పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హీరో విజయ్ ఇంటిని తనిఖీలు చేసి బందోబస్త్ ఏర్పాటు చేశారు.