త్రివిక్రమ్ లాంగ్ షెడ్యూల్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నా పేరు సూర్య తర్వాత చాల గ్యాప్ తీసుకున్న బన్నీ..త్రివిక్రమ్ సినిమా ఒప్పుకోనున్నాడు. ఈ మధ్యనే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుపుకుంది. రెండు ఫైట్లు తీసి గ్యాప్ ఇచ్చారు. స్క్రిప్ట్ ఫినిషింగ్ లో త్రివిక్రమ్ బిజీగా వుండడంతో రెండో షెడ్యూల్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయిందని..బన్నీ – త్రివిక్రమ్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని..అందుకే సినిమా మధ్య లో ఆపేశారనే వార్తలు ఊపందుకున్నాయి.

దీంతో చిత్ర యూనిట్ రంగంలోకి దిగి ఆ వార్తలను ఖండించారు. ఈనెల 29 నుంచి ఓ లెంగ్తీ షెడ్యూలుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దాదాపు 30 రోజుల షెడ్యూలును కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే ప్లాన్ చేశారట. ఈ నెల 29న ప్రారంభించి వచ్చేనెల 26 దాటే వరకు సింగిల్ షెడ్యూలు లో దాదాపు ఇరవై నుంచి ముఫైశాతం సినిమాను ఫినిష్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే థమన్ మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలు పెట్టాడు. హారిక & హాసిని , గీత ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.