అల్లు అర్జున్ రికార్డుల ప్రభంజనం ఆగడం లేదు

అల్లు అర్జున్ – పూజా హగ్దే జంటగా త్రివిక్రమ్ డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా వచ్చినా మూవీ అల వైకుంఠపురం లో. ఈ మూవీ మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్టు అయ్యిందో తెలియంది కాదు. థమన్ అందించిన ప్రతి సాంగ్ యూట్యూబ్ లో సంచలన వ్యూస్ సొంతం చేసుకున్నాయి.

ఈ మూవీ లోని బుట్టబొమ్మ సాంగ్ పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ‘బుట్టబొమ్మ’ సాంగ్ 250 మిలియన్స్ మైల్‌స్టోన్ దాటేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటిదాకా చూస్తే ‘బుట్టబొమ్మ’ సాంగ్ యూట్యూబ్‌లో 250 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి పరుగులు పెడుతోంది. మరోవైపు ఎందరో సెలబ్రిటీలు ఈ సాంగ్‌పై స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి..